NTV Telugu Site icon

Drugs Mafia: రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‭ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?

Drugs

Drugs

Drugs Mafia: ప్రపంచంలోని ప్రతి దేశంలో డ్రగ్స్ వాడకం ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. ఇక అత్యంత ఎక్కువ జనాభ ఉన్న దేశాలలో భారత్ ఒకటి. దింతో భారత్ లో ప్రమాదకరమైన డ్రగ్స్ ను అమ్మెందుకు డ్రగ్స్ డీలర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ ను nనివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇకపోతే తాజాగా అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురంలో పోలీసులు రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ని కొలిమిలో తగులబెట్టారు. అయితే ఇలా డ్రగ్స్ ని కొలిమిలో కాల్చడానికి గల కారణాన్ని తెలుపుతూ.. ఈ డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో కాల్చలేమని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల సరుకు దేశంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల మొత్తంగా ఉంది. ఈ చర్యకు డీజీపీ ధాలివాల్ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ ను నాశనం చేయడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన పేర్కొన్నారు.

Also Read: Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్‌ను రిసీవ్ చేసుకున్నా..

బహిరంగ ప్రదేశంలో కాల్చినా, గుంతలో పూడ్చినా కాలుష్యం ఎక్కువగా వస్తుందని.. అలా చేయడం వల్ల దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సివిల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అండమాన్-నికోబార్ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని, అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.36 వేల కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వీటికి సంబంధించిన ఆరుగురు విదేశీ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 36000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేయడంపై డీజీపీ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ.. అండమాన్ అండ్ నికోబార్ పోలీసులు 6000 కిలోల కంటే ఎక్కువ విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసుకున్నారని, 222 ప్లాస్టిక్ సంచులలో ఈ మత్తుపదార్థాలను సముద్రంలో తీసుకెళ్తున్న సమయంలో బారన్ ద్వీపం దగ్గర నేవీ వారిని పట్టుకుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వాధీనం అని అన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖతో పాటు స్థానిక అధికారుల సహకారంతో అతి తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తం డ్రగ్స్ ను ధ్వంసం చేయగలిగామని చెప్పారు.

Show comments