NTV Telugu Site icon

Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే

Sreemukhi

Sreemukhi

Anchor Sreemukhi: యాంకర్‎గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లికూతురు గెటప్ లో చాలా అందంగా కనిపించారు. ఎప్పటిలాగే ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదే ఉందని… పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. అలాగే ఆధారం లేకుండా రాసే కథనాలపై మండిపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా చెప్తానన్నారు.

Read Also: RK Beach : ఆర్కేబీచ్‎లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం

శ్రీముఖి ప్రస్తుతం అరడజనుకు పైగా షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా స్టార్ మాలో మొదలైన బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెర అవకాశాలను కూడాఅందిపుచ్చుకుంటుంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా చాన్సులు కొట్టేస్తోంది. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి భారీ చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారు. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట.

Read Also : Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషీ’ మూవీ స్టోరీ లీక్

Show comments