Site icon NTV Telugu

Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj Post on Tollywood Hero: టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ భరధ్వాజ్.. జబర్దస్త్ షోతో స్టార్ అయ్యారు. జబర్దస్త్ పాపులారీతో అను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్టుగా మారారు. వరుస సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఇంత బిజీలో కూడా అనసూయ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఎక్స్‌ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.

‘మరీ ఇంత చేతకానివాళ్ల లాగా ఉంటే ఎలా అండి. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు. అస్తమానం నేను ఏం చేసినా ఆ టాపిక్‌ లాగేవారిని అనండి మీకు దమ్ముంటే. కానీ మీరు అలా చేయరు కదా?. ఎందుకంటే.. మీకు అది చేతకాదు. మీ హీరో లాగా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శుభరాత్రి’ అని అనసూయ భరధ్వాజ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్.. నేడు తులంపై వెయ్యి తగ్గింది! 8 రోజుల్లో 5 వేలు

ఈ పోస్ట్‌తో హాట్ యాంకర్‌ అనసూయ భరధ్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ఎవరిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు?, అసలేం జరిగింది? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఓ యంగ్‌ హీరోని ఉద్దేశించి అను పోస్ట్‌ చేయగా.. అది కాస్త దుమారం రేగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. ఈ పోస్ట్ కూడా ఆ హీరో గురించే కావొచ్చు. ఇంతకీ ఎవరా? హీరో అని ఇప్పటికే మీకు అర్ధమైపోయుంటుంది.

Exit mobile version