తెలుగులో బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేసిన వ్యక్తి అనసూయ భరద్వాజ్. అనసూయ బుల్లితెరకు పరిచయం కాకముందు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కొనసాగే కార్యక్రమాలు అనసూయ రాగానే ఒక్కసారిగా బుల్లితెరపై గ్లామర్ షో పెరిగిపోయింది. అనసూయ తెలుగు బుల్లితెరను అంతలా మార్చేసిందని చెప్పవచ్చు. జబర్దస్త్ షోలో యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆపై అంచయించలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన నటనకు మంచి మార్కులు వేపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
Also Read: RC16 : RC16 నుంచి అదిరిపోయే అప్డేట్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని ఇది వరకు తెలిపారు. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేకున్నా.. ఏ పార్టీ ముఖ్యం కాదని., అయితే నాయకులు ముఖ్యమని ఆవిడ చెప్పుకొచ్చింది. పార్టీ ఏదైనా సరే.. తనకి నాయకులు నిర్దేశించిన అజెండా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తానని ఆవిడ చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యం లోనే తాజాగా ఆవిడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇందులో భాగంగానే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిస్తే తాను కచ్చితంగా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆవిడ వెల్లడించారు.
Also Read: Mahua Moitra: మహువా మొయిత్రాకు నేడు విచారణ రావాలని ఈడీ నోటీసులు..!
ఈ సందర్బంగా ఆవిడ జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేయడంపై కూడా స్పందించారు. తనకి వరుస సినిమా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో డేట్స్ కుదరకపోవడం వల్లే తను జబర్దస్త్ కార్యక్రమ యాంకర్ పోస్టుకు వెళ్ళట్లేదని తెలిపారు. అయితే సమయం దొరికినప్పుడు సెట్స్ కు కూడా వెళ్తుంటానని ఆవిడ తెలిపారు.
