NTV Telugu Site icon

Anasuya Bharadwaj: పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!

Anasuya Bharadwaj Hot Pics

Anasuya Bharadwaj Hot Pics

Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్‌ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్‌ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

‘మరో రోజు.. మరో ట్రెక్.. మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి’ అని అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి వాటర్ ఫాల్ నీటిలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ జత చేశారు. ఈ ఫొటోస్‌లో అనసూయ చాలా హాట్ హాట్‌గా ఉన్నారు. పొట్టి డ్రెస్‌లో ఉన్న అను అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Kunamneni Sambasiva Rao: బీజేపీ త్రాచుపాము లాంటిది.. తలలోనే కాదు తోకలోనూ విషం ఉంది!

సామాజిక మాధ్యమాలలో అనసూయ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఫొటోలను నిత్యం పంచుకుంటూ ఉంటారు. ఇటీవల రజకార్‌ మూవీలో పోచమ్మగా మెప్పించిన అనసూయ.. పుష్ప2లో దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తొలి భాగంలో కేవలం కొన్ని సీన్లకే పరిమితమైన అను.. రెండో భాగంలో మరింత కీలకం కానున్నారు.

Show comments