Ananya Pande : రొమాన్స్ చేయాలని ఉంది : అనన్య పాండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Pande : సినీ ఇండస్ట్రీ లాంటి పోటీ ప్రపంచంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడమంటే అంత సులభం కాదు. అందం ఉంటే సరిపోదు కాసింత అదృష్టం కూడా ఉండాలి. అయినా మేల్ డామినేషన్ ఉండే ఈ ఫీల్డులో హీరోయిన్లు తమ కెరీర్ కొనసాగించాలంటే.. వచ్చిన ఏ ఆఫర్ వచ్చినా కాదనొద్దు. ఈ విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తాను ఎలాంటి రోల్స్ చేయడానికైన సిద్ధమేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు కుర్రకారును అట్రాక్ట్ చేసింది. తొలి మూవీనే డిజాస్టర్ అయినా.. కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో తాను అనుకున్నట్లు ఆఫర్లు రాక తిరిగి బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘డ్రీమ్‌గర్ల్ 2’లాంటి చిత్రాలతో అక్కడి ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో, హాట్ వెబ్ సీరిస్ ల్లో నటిస్తూ ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.
Read Also:Heartbreaking Incident: కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే ఇంటికి వెళదాం..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అనన్య నటించిన సినిమాలు చెప్పుకో తగ్గ విధంగా విజయం సాధించకున్నా.. ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. తాజాగా ‘కంట్రోల్’తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ మూవీకి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో విహాన్ సమత్ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా అనన్య పాండే, విహాన్ సమత్ కలిసి నటించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అనన్య మాట్లాడుతూ..‘‘కరణ్ జోహర్ దర్శకత్వంలో వచ్చిన ‘కాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో కేవలం చిన్నపాత్రలో నటించే అవకాశమే వచ్చింది. కానీ, ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలనుంది. అంటూ తన మససులోని మాటను బయటపెట్టింది. ఇక సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. తాను చిన్నప్పుడు ఓ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాననీ, ఆ విషయం తన తల్లికి తెలిసి దాన్ని డీఆక్టివేట్ చేసిందనీ, 18 ఏళ్లు నిండిన తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో అడుగుపెట్టానని, బ్రేక్ దొరికితే ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటాననీ, తనకు నచ్చిన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటానని చెప్పారు అనన్య పాండే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ టైంలో అనన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!