Heartbreaking Incident: రోడ్డు ప్రమాదం ఓ కుటంబాన్ని చిదిమేసింది. కొద్ది సేపట్లో అందరూ ఇంటికి చేరుకుంటాం అనుకునేలోపే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొడుకు లేడనే విషయం తెలిసినా తల్లికి ఆశ చావదు.. తన కొడుకు బతికి ఉన్నాడని హడావిడి చేస్తూ ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడి వైద్యులు చిన్నారిని చూసి మృతి చెందినట్లు తెలిపారు. అప్పటి వరకు తన ఓడిలో కూర్చున కొడుకు తిరిగి రాడని తెలిసి కూడా.. బెడ్ పై వున్న కన్న కొడుకు చేయి పట్టుకుని లే కన్నా ఇంకా ఎంత సేపు పడుకుంటావు అంటూ చెప్పిన మాటలు అక్కడున్న వారందరికి కంటతడి పెట్టించాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
Read also: Kitchen Sponge: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్‌లతో గిన్నెలు కడుగుతున్నారా? అయితే..
చిన్నారిని కబళించిన మృత్యువు..
అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల చిన్న కొడుకు అనారోగ్యం క్షీణించింది. దీంతో తల్లిదండ్రలు పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించి మందులు తీసుకుని ఇంటికి బయలు దేరారు. బైక్ పై నలుగురు వెలుతుండగా ఇంతలోనే బైక్ అదుపు తప్పింది. దీంతో నలుగురు ఒక్కసారిగా కిందకు పడిపోయారు. బైక్ పై ముందు కూర్చున్న పెద్ద కొడుకు శ్యామ్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా.. శ్యామ్ రోడ్డుపై ఉలుకుపలుకు లేకుండా పడిపోయాడు. దీంతో తల్లి వెంటనే శ్యామ్ వద్దకు వెళ్లి చూడగా తలలో నుంచి రక్తం కారుతుంది. దీంతో హుటాహుటిన శ్యామ్ ను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. అయితే శ్యామ్ ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే అని పిలుస్తూ ఉండిపోయింది. అయితే.. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో తండ్రి కూడా బోరున విలపిస్తూ ఉండిపోయారు. వీరిని చూసిన వారందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
DB Stock Broking Scam: హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం..