Ananya Panday: భారీ అంచనాల నడుమ రిలీజైన లైగర్ సినిమా ఎంతటి ఘోర పరాజయం పాలైందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో చిత్ర బృందం భారీ షాక్కు గురయ్యారు. సినిమా తన కెరీర్ కు బాగా ప్లస్ అవుతుందనుకున్న హీరోయిన్ అనన్య పాండే ఆశలు ఆవిరయ్యాయి. తను సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదన్న విమర్శలే దక్కాయి. సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో పాగా వేయాలనుకుంది. కానీ ఆమె ప్లాన్స్ అన్నీ బెడిసికొట్టాయి. సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో పాటు అనన్య నటనపై ట్రోలింగ్ జరిగింది. బాలీవుడ్ లో కూడా అనన్య పరిస్థితి అలానే తయారైంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో ఆరంగేట్రం చేసిన అనన్య ఆ తరువాత కొన్ని అవకాశాలు దక్కించుకుంది.
Read Also: Bandla Ganesh : హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ అన్న బండ్ల గణేష్.. ఇంతకీ ఆ హీరో ఎవరు?
‘గెహ్రాయాన్’ అనే సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ సినిమా క్రెడిట్ దీపికా పదుకునే ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అనన్య బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అవి వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడో ఒప్పుకున్న కమిట్మెంట్స్ తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ అనన్య చేతుల్లో లేవు. దీంతో ఆమె రెమ్యునరేషన్ భారీగా తగ్గించిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఈమె ఒక్కో సినిమాకి రూ.80 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అందులో సగానికి పైగానే కట్ చేసుకొని ఇప్పుడు రూ.30 లక్షలు ఇస్తే చాలు అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి ఓకే చెబుతుందట. ఆమె ఎంతగా ప్రయత్నిస్తున్నా.. మేకర్స్ మాత్రం ఆమెకి ఛాన్సులు ఇవ్వడానికి రెడీగా లేరని సమాచారం.