Site icon NTV Telugu

Ananya Panday: అనన్య పాండే కొన్న కొత్త ఇంటి ధర ఎన్ని కోట్లో తెలుసా?

Ananya Pande

Ananya Pande

బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. లైగర్‌ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్‌ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు.

ఇప్పుడు ఈ అమ్మడు కొత్త విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ధన్‌తేరాస్ రోజే కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. తన నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసింది అనన్య పాండే.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నా కొత్త ఇల్లు. మీ ప్రేమాభిమానాలు మాపై ఉండాలి. అందరికీ దంతేరాస్ శుభాకాంక్షలు’ అని అనన్య పాండే తన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఇంట్లో పూజ వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..

అనన్య పాండే ముంబై లో జుహు ప్రాంతానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ప్లాట్ కోసం అనన్య పాండే ఆరు కోట్లు పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటి మొత్తం వైశాల్యం 3000 చదరపు అడుగులని తెలుస్తోంది. ఈ విలాసవంతమైన ఇంట్లో అనన్య పాండే ఒంటరిగానే ఉంటుందని తెలుస్తోంది.. ఇప్పటికి పలువురు స్టార్ ముంబై లో సొంతంగా ఇల్లు కొన్నారు.. కేరీర్ విషయానికొస్తే..అనన్య నటించిన ఆరు సినిమాలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. అందులో తెలుగు లైగర్‌ కూడా ఒకటి. అనన్య ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఓటీటీ లు, వెబ్‌ సిరీసుల్లోనూ నటిస్తోంది.. అవన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి..

Exit mobile version