NTV Telugu Site icon

Prabhakar Chowdary: కార్యకర్తలు ఓకే అంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: ప్రభాకర్ చౌదరి

Prabhakar Chowdary

Prabhakar Chowdary

Ex MLA Prabhakar Chowdary on Chandrababu Naidu: తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలని ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు ఓకే అంటే మాత్రం తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Top Headlines @1PM: టాప్ న్యూస్!

ఈరోజు అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ… ‘అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలి. నాకు పార్టీ మారే ఆలోచన లేదు. చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలనుంది. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా. 2014కు ముందే సీఎం వైఎస్ జగన్ నాకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. అయినా నేను పార్టీ మారలేదు. పార్టీ కోసం, చంద్రబాబు కోసం కష్టపడి పని చేశా. దగ్గుబాటి ప్రసాద్‌కు ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో బాబు సమాధానం చెప్పాలి. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదు. ఏ రోజు ఆయన పార్టీ కోసం పని చేయలేదు’ అని మండిపడ్డారు.