Anant Ambani Watch: భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. త్వరలో అంబానీ కుటుంబానికి కోడలిగా మారబోతున్న రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ ఈ కార్యక్రమానికి వచ్చారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ జంటకు ఎంగేజ్ మెంట్ జరిగింది. అప్పటి నుంచి వారిద్దరు జంటగా ప్రతీచోట కనిపిస్తున్నారు. ఈ జంట ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలతో పాటు వారు ధరించిన దుస్తులు, ఆభరణాలు వార్తల్లో ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి.
Read Also: Boney Kapoor : ఛీ..ఛీ ఈ వయసులో ఇదేం బుద్ధి.. శ్రీదేవీ భర్తపై నెటిజన్ల ఫైర్
అనంత్, రాధిక ఇటీవల నీతా ముఖేష్ ఆర్ట్ కల్చరల్ సెంటర్లో జంటగా కనిపించారు. ఆ కార్యక్రమంలో వారు ధరించిన దుస్తులు ఆభరణాలు వైరల్ అయ్యాయి. అనంత్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించగా, రాధిక లేత నీలం రంగు లెహంగాలో కనిపించింది. ఈ క్రమంలో అనంత్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లగ్జరీ చేతి గడియారం విలువ తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వాచ్ ఖరీదు అక్షరాల రూ. 18 కోట్లు. అనంత్ కోసమే ఈ వాచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. పాటెక్ ఫిలిప్ కంపెనీ తయారు చేసిన ఈ వాచ్‌కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత సంక్లిష్టమైన చేతి గడియారం అని indianhorology పేరు గల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు. ‘దీనికి 20 ప్రత్యేకతలు ఉన్నాయి. రివర్సిబుల్ మెకానిజం, రెండు ఇండిపెండెంట్ డయల్స్, 6 పేటెంట్ ఆవిష్కరణలను ఈ వాచ్ కలిగి ఉంది. ఎంచుకున్న సమయానికి ప్రత్యేక శబ్దంతో అలర్ట్ చేసే అలారం, డేట్ రిపీటర్, మాన్యువల్ ఆపరేటర్ దీని అదనపు ప్రత్యేకతలు. వైట్ గోల్డ్ కలర్ దీనికి మరింత వన్నె తీసుకొచ్చింది. ఫ్రంట్, బ్యాక్ డయల్‌ను కలిగి ఉంది’ అని ఆ పేజీలో పేర్కొన్నారు. చేతి గడియారం ఎలిగేటర్ తోలు, చేతితో కుట్టిన క్లాస్ప్‌తో బంగారు డయల్ ప్లేట్‌లతో అలంకరించబడింది.
Read Also:LIC’s Superhit Policy : 4ఏళ్లు డబ్బు డిపాజిట్ చేయండి.. రూ.కోటి సొంతం చేసుకోండి
ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు కూడా ముంబైకి చేరుకున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, రేఖ, కాజోల్, టామ్ హాలండ్, జెండయా, పెనెలోప్ క్రూజ్, జిగి హడిద్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు అతిథులలో ఉన్నారు. వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా NMACCలో కనిపించారు.