Site icon NTV Telugu

Ambani Sangeet Party: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ లో బాలివుడ్ తారల హంగామా..

Ambani Sangeet Party

Ambani Sangeet Party

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారు. కాగా..నిన్న సాయంత్రం ఒక గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. ఈ పార్టీకి దబాంగ్ సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. జియో సెంటర్‌లో జరిగిన అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్‌ల సంగీత వేడుకకు రణ్‌వీర్ సింగ్, అలియా భట్, రణబీర్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. సంగీత పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా సల్మాన్ ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

READ MORE: Shocking report: త్రిపురలో ఎయిడ్స్‌తో 47 మంది విద్యార్థుల మృతి.. కారణమిదే!

సంగీత్ పార్టీకి చెందిన సల్మాన్ ఖాన్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. త్వరలో తండ్రి కాబోతున్న రణ్‌వీర్ సింగ్ ఢోలక్‌పై కూర్చుని పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్టు క్లిప్‌లో చూడవచ్చు. ఆకాష్ అంబానీ, అనంత్‌లతో కలిసి కనిపిస్తున్న ఈ వీడియోలో సల్మాన్ కూడా ఉన్నాడు. పక్కనే నిలబడి క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా డ్యాన్స్ లో లీనమైపోయాడు. “ముంబయిలో జరిగిన సంగీత వేడుకలో సల్మాన్ ఖాన్ రణవీర్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యాతో కలిసి జుమ్మే కీ రాత్‌లో అనంత్ భాయ్.. ఆకాష్ అంబానీ” అని రాసుకొచ్చారు. సల్మాన్, రణ్‌వీర్ సింగ్‌ల నృత్యం చాలా సరదాగా ఉంది. అతని ఈ వీడియో అభిమానుల హృదయాలను కదిలించింది. దీంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తమ అభిమాన నటుల్ని ప్రశంసిస్తూ.. కాంమెంట్లు పెడుతున్నారు.

READ MORE: Khushbu: “నా పెళ్లిలో ఆ హీరో గుక్కపెట్టి ఏడ్చాడు..” 24 ఏళ్ల తర్వాత నిజాన్ని బయటపెట్టిన ఖుష్బూ!

కాగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ పెళ్లి ముచ్చట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్‌ వేడుక అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పలు జంటలకు పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో జులై 2న సాయంత్రం సామూహిక వివాహాలు జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన పలు జంటలకు ఇందులో సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ఈ వేడుకలకు ముకేశ్‌ అంబానీ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. నిన్న జరిగిన సంగీత్ అందరినీ ఆకట్టుకుంది. దేశ, విదేశాల్లోని ప్రముఖులందరూ ఈ వేడుకకు హాజరై అలరిస్తున్నారు. ఈ నెల 12న పెళ్లి వేడుక జరగనుంది.

Exit mobile version