NTV Telugu Site icon

Anant ambani: కాబోయే భార్య గురించి అనంత్ ఏమన్నారంటే..!

Ambani

Ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాధిక మర్చంట్‌ను అనంత్ వివాహ మాడనున్నారు. జూలైలో వీరి పెళ్లి జరగనుంది. అయితే ముందుగా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేర్లను, కంపెనీల సీఈవోలను ఆహ్వానించారు. ఇక అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2500 రకాలైన ఫుడ్ ఐటెమ్స్ పెట్టనున్నారు.

ఇక కాబోయే భార్య రాధిక మర్చంట్ గురించి అనంత్ అంబానీ కీలక విషయాలను పంచుకున్నారు. ఆరోగ్య విషయంలో తాను ఈ స్థితిలో ఉండడానికి రాధికనే కారణమని చెప్పుకొచ్చారు. రాధిక చూపిన ప్రత్యేకమైన శ్రద్ధ గురించి ఎంతో గొప్పగా ప్రశంసించారు. ఊబకాయం, ఉబ్బసంతో పోరాడుతున్నప్పుడు రాధిక ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని వివరించారు. తన ఆరోగ్య విషయంలో  రాధిక తీసుకున్న శ్రద్ధ వల్లే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని అనంత్ చెప్పుకొచ్చారు.

రాధిక తన కలల రాణి అని వ్యాఖ్యానించారు. రాధిక తన జీవితంలోకి రావడం అదృష్టవంతుడనని సంతోషం వ్యక్తం చేశారు. జంతువులను చూసుకోవడానికే తన జీవితం అంకితం అనుకుని పెళ్లి చేసుకోకూడదని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. కానీ రాధికాను చూశాక.. తన లాంటి విలువలను పంచుకోవడం చేశానని పేర్కొన్నారు. జంతువుల పట్ల రాధికకు విశేషమైన అభిమానం ఉందని తెలిపారు.

Show comments