Site icon NTV Telugu

Anant Ambani Wedding: స్నేహితులకు 2 కోట్ల వాచ్.. అంబానీతో అట్లుంటది మరి!

Anant Ambani Gifts

Anant Ambani Gifts

Anant Ambani gifted 25 luxury watches worth 2 crore to his friends: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) అనంత్-రాధికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శనివారం (జులై 13) రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అంబానీ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.6000 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అనంత్ అంబానీ తన స్నేహితులకు ఖరీదైన వాచీలను బహుమతిగా ఇచ్చారు.

Also Read: Mahesh Babu-Hardik Pandya: ఏంట్రా.. ఇంత అందంగా ఉన్నాడు! మహేష్ బాబుని చూసి షాక్ అయిన హార్దిక్

లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన ‘అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్’ అనే వాచీలను అనంత్ అంబానీ తన దగ్గరి స్నేహితులకు బహుమతులుగా ఇచ్చారట. మార్కెట్‌లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్లు అని తెలుస్తోంది. ఈ ఎడిషన్‌లో 25 పీస్‌లు మాత్రమే ఉన్నాయట. గోల్డ్ బ్రాస్‌లెట్ మాదిరి ఈ వాచీలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, శిఖర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫ్రీ.. చాలా మంది సెలబ్రిటీలు ఈ వాచీలు అందుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version