NTV Telugu Site icon

Anand Mahindra : ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..

Anand Mahendra

Anand Mahendra

సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత ఎంఎస్ ధోని అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇన్సింగ్స్ ఆఖరి ఓవర్ లో ధోని ఔటయ్యాడు. అయితే మార్క్ వుడ్ 19 ఓవర్ లో వేసిన రెండో-మూడు బాల్స్ ను మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.

Read Also : Writeoff Loans: రుణాలను రైటాఫ్‌ చేస్తే చెల్లించాల్సిన పనిలేదా? నిర్మలాసీతారామన్‌ ఏమంటున్నారంటే..

ఇప్పుడు.. ధోనీని అతని అభిమానులు సూపర్ హీరో కంటే ఎక్కువగా చూస్తున్నారని ఆనంద్ మహీంద్రా అన్నారు. కాబట్టి, అతనికి CSK యూనిఫారంతో పాటు కొత్త యూనిఫాం కూడా తయారు చేయించాలని ఆయన సూచించాడు. కొన్ని వినూత్నమైన, ఆసక్తికరమైన కేప్ డిజైన్‌లతో ముందుకు రావాలని ట్విట్టర్ వినియోగదారులను ఆనంద్ మహీంద్రా కోరారు.

Ipl Ad

Read Also : Today Business Headlines 04-04-23: ఫార్మాలోకి నిర్మా. మరిన్ని వార్తలు

MS ధోనీ యొక్క ప్రత్యేక యూనిఫామ్‌లో ఒక కేప్‌ను తప్పనిసరిగా తయారు చేయాలని తాను భావిస్తున్నాను.. అది లేకుండా సూపర్ హీరో ఎలా వెళ్తాడని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ కు సంబంధించిన ఒక వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. దానిని అభిమానులతో పంచుకున్నాడు. ఎంఎస్ ధోనితో ఉన్న యానిమేషన్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.