Site icon NTV Telugu

Anand Mahindra AI video: సమ్‌థింగ్‌ స్పెషల్‌.. ఆకట్టుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా వీడియో..

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra AI video: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా… సోషల్‌ మీడియాలో పంచుకునే విషయాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్నట్లుగా ఉంటాయి. ఇదే కోవలో ఆయన మరో ప్రత్యేకమైన వీడియోను… తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. ఈ వీడియో ఓ బాలిక 5 ఏళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వృద్ధురాలిగా మారడాన్ని చూపించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో రూపొందించిన ఈ వీడియో అద్భుతంగా ఉందని కామెంట్‌ చేశారు. ప్రస్తుతమీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Read Also: CSK vs RR : భారీ స్కోర్ చేసిన రాజస్థాన్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే..?

ఇక. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆనంద్‌ మహీంద్రా. ఇందులో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసు నుంచి 95 ఏండ్ల వయసు వరకు ఎలా మారుతుందనేది చూడొచ్చనీ, AI తో తనకైతే ఎలాంటి భయాలు లేవనీ, నిజంగా ఇది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోందనీ ఆయన కామెంట్‌ చేశారు. ఇది చాలా అందంగా, మెస్మరైజ్‌ చేసేలా ఉంది. వాస్తవానికి చాలా దగ్గరగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version