యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానన్న ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు..