NTV Telugu Site icon

Anam Jayakumar Reddy: ఆనం ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. వైసీపీలో చేరిన రాంనారాయణరెడ్డి సోదరుడు

Anam Jayakumar Reddy

Anam Jayakumar Reddy

Anam Jayakumar Reddy: నెల్లూరు రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, సీనియర్‌ పొలిటీషియన్‌, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ గూటికి చేరగా.. ఇప్పుడు ఆనం ఫ్యామిలీలో మరో ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆనం రాంనారాయణ రెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి.. గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు జయకుమార్ రెడ్డి.. అయితే, తన మరో సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ రోజు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.. జయకుమార్ రెడ్డి.. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి.. వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.. కాగా, ప్రస్తుతం నెల్లూరు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ.. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీకి ఆనం రాంనారాయణ రెడ్డి దగ్గర కావడంతో.. ఇప్పుడు జయకుమార్‌ రెడ్డి వైసీపీ చేరడం నెల్లూరు జిల్లా రాయకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Read Also: JioBharat V2 4G phone: ₹999కే 4G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లివే!