NTV Telugu Site icon

300 Dishes: 300 రకాలు వంటకాలు.. అనకాపల్లిలో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం

300 Dishes

300 Dishes

300 Dishes: ఆ గోదావరి వాళ్ల ప్రేమలే వేరప్ప.. మర్యాద చేయడంలో వారికి వారే సాటి అని చెబుతుంటారు. ఎవరింటికైనా వారి ఇంటికి వెళ్తే బొజ్జ నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.. అదే.. అల్లుడి ఇంటికొస్తే.. ఆయన కొత్తు అల్లుడైతే.. ఆయన పండగకే ఇంటికొస్తే.. పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా ప్రత్యక్షమవుతాయి. ఇప్పటి వరకు 50 రకాల వంటకాలు, 100 రకాల వంటకాలు, 150 రకాలు, 250 వంటకాలు ఇలా ఎన్నో చూశాం.. కానీ, సంక్రాంతి అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలు స్పెషల్ అనుకుంటే అంతకంటే సూపర్ అంటున్నారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా..! అనిపించారు.

Read Also: Donald Trump: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జోరు.. తొలి విజయం

50 వెరైటీలే ఎక్కువను కుంటే ఏకంగా 300 రకాలు వంటకాలతో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం ఇచ్చారు అనకాపల్లికి చెందిన దంపతులు.. అనకాపల్లికి చెందిన బియ్యం వ్యాపారి తన కుమార్తె రిషితకు విశాఖపట్నం చెందిన దేవేంద్రనాథ్ కి ఇచ్చి వివాహం చేశారు.. ఇక, వారి పెళ్లి జరిగిన తర్వాత మొదటి సంక్రాంతి పండగకు అత్తారింటికి వచ్చాడు అల్లుడు.. అతడికి గుర్తుండిపోయేలా.. అంతా అదిరిపోయేలా ప్రేమచూపిస్తూ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా 300 రకాలకు పైగా పిండివంటలు, స్వీట్స్, ఐస్ క్రీమ్.. ఇలా 300 రకాలు అంటే ఎన్ని వెరైటీలు ఉంటాయే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అలా రకరకాల వంటలతో దగ్గరుండి తినిపించి అల్లుడికి మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు అనకాపల్లి అల్లుడికి 300 రకాల వంటకాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

Anakapalle Sankranthi Alludu : ఏకంగా 300 రకాలు వంటకాలతో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం l NTV