Squash Champion: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా అనాహత్ సింగ్.. భారత్ తరఫున సరికొత్త చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాలోని నయాగరా-ఆన్-ది-లేక్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచి, గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 18 ఏళ్ల అనాహత్ రికార్డు పుటలకెక్కింది. ఫైనల్ పోరులో టాప్ సీడ్ అనాహత్ సింగ్, రెండో సీడ్ ఈజిప్ట్ క్రీడాకారిణి రుకాయ్యా సలెమ్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేసింది. మొదట్నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన అనాహత్ 11-3, 11-7, 11-9 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని ముద్దాడింది. ఈ విజయం ద్వారా దాదాపు 15 ఏళ్లుగా ప్రపంచ జూనియర్ స్క్వాష్‌లో కొనసాగుతున్న ఈజిప్ట్ ప్లేయర్ల ఆధిపత్యానికి అనాహత్ చెక్ పెట్టింది.
21 ఏళ్ల తర్వాత రికార్డు తిరగరాసి..
గతంలో 2005లో భారత స్క్వాష్ దిగ్గజం జోష్నా చిన్నప్ప ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఏ భారతీయ ప్లేయర్ కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇప్పుడు అనాహత్ ఏకంగా టైటిల్ గెలుచుకుని జోష్నా రికార్డును అధిగమించడమే కాకుండా, భారత్‌కు మొదటి పసిడి పతకాన్ని అందించింది.
Also Read
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
- Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..
- E20 JANTA PARTY: సీజేపీ తర్వాత, "E20 జనతా పార్టీ" పుట్టుకొచ్చింది.. వీళ్ల డిమాండ్ ఇదే..
‘నా కల నెరవేరింది. జూనియర్ స్థాయిలో నాకు ఇదే చివరి అవకాశం కాగా, ఈ విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉంది’ అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది. గతంలో బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్న అనాహత్, ఈసారి లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు విశేష ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె సాధించిన ఈ చారిత్రక ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
-
Squash Champion: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా అనాహత్ సింగ్.. భారత్ తరఫున సరికొత్త చరిత్ర..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..
-
Missing Schoolgirls : మిస్టరీకి ఎండ్.. మాయమైన బాలికలు.. సేఫ్‌గా దొరికారు.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!