Site icon NTV Telugu

Bapatla Crime: గ్యాంగ్ రేప్ ఘటనలో ఊహించని ట్విస్ట్..!

Crime News

Crime News

Bapatla Crime: బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. అయితే, ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌ వచ్చి చేరింది.. అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ముగ్గురు యువకులు తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మైనర్‌ బాలిక.. ఇక, మైనర్ బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు.. అయితే, అలాంటి ఘటన ఏమీ జరగలేదని.. గ్యాంగ్‌ రేప్‌ వట్టిదేనని నిర్ధారణకు వచ్చారు.

Read Also: GT vs CSK Qualifier-1: ఒక్క ప్లే ఆఫ్స్ లో 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

అసలు విషయం ఏంటంటే.. తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన బాలిక.. ఆలస్యం కావడంతో ఇంట్లో ఏం చెప్పాలో.. చెబితే తిడతారేమోనని కొత్త ప్లాన్‌ వేసింది.. అందులో భాగంగా.. ఇంట్లో తనపై అత్యాచారం జరిగిందని.. అది కూడా సామూహిక అత్యాచారం అంటూ చెప్పింది.. అయితే, పోలీసుల విచారణలో ఓ యువకుడితో సాన్నిహిత్యం ఉండటం వల్లే అక్కడకు మరో ఇద్దరు మైనర్ బాలికలతో కలసి వెళ్లాలని ఒప్పుకుందట బాధిత మైనర్ బాలిక.. ఇంటికి రావటం ఆలస్యమైనందున తల్లిదండ్రులు తిడతారని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫేక్ ఫిర్యాదు చేసింది బాలిక.. విచారణ చేపట్టిన పోలీసులు.. పూర్వాపరాలు విచారణ చేపట్టి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

Exit mobile version