NTV Telugu Site icon

Mancherial : బిడ్డను ప్రేమించాడని మేనల్లుడికి బీరులో విషమిచ్చి చంపిన మామ

Mancherial : కుటుంబ బంధాలకు నేడు విలువ లేకుండా పోయింది. కన్న కొడుకుతో సమానంగా చూసుకోవాల్సిన మేనల్లుడిని మేనమామే దారుణంగా హతమార్చడం వినే వారికి షాక్ కలిగిస్తుంది. కూతురుని ప్రేమిస్తున్నాడన్న కారణంతో రక్త సంబంధాన్ని కూడా పట్టించుకోకుండా తండ్రి చేసిన పనికి సమాజమే నివ్వెరపోతుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో దారుణం జరిగింది. కూతురు ను ప్రేమించాడని కత్తితో బెదిరించి బీర్ లో గడ్డిమందు కలిపి త్రాగించి హత్యచేసిన మేనమామ విషయం వెలుగు లోకి వచ్చింది.

Read Also: Tasty Food : ఫుడ్ బాగోలేదని కూతురు కళ్లెదుటే భార్యను చంపిన భర్త

గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ (22) తన మేనమామ కూతురు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన అతని మేనమామ మాట్లాడేది ఉంది రమ్మని చెప్పి లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోని మోదెల చెట్ల సమీపంలో కత్తితో బెదిరించి గడ్డిమందు కలిపిన బీర్ త్రాగించాడు. అనిల్ స్పృహ తప్పగానే అనిల్ మేనమామ అక్కడి నుండి పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన అనిల్ ను ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ జరిగిన విషయం చెప్పాడు. ఆ తరువాత చనిపోయాడు. ఇప్పుడు అనిల్ చనిపోకముందు మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటికే తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన లక్షేట్టి పేట పోలీసు లు అనిల్ చనిపోయే ముందు వివరించిన వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Show comments