NTV Telugu Site icon

Goosebumps Video: గోడలోకి చొచ్చుకెళ్లిన పాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్

Snake

Snake

ప్రపంచంలో ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఒకటి. దాదాపుగా ఇవి అన్నీ చోట్ల కనిపిస్తూంటాయి. ఎక్కువగా అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇండ్లలో కూడా కనిపిస్తాయి. అయితే పాముల్లో కొన్ని విషపురీతమైనవి ఉంటే.. మరికొన్ని వాటిల్లో విషం ఉండదు. అంతేకాకుండా వాటితో మనుషులకు ప్రమాదం ఉన్నప్పటికీ.. వాటిని చూస్తేనే భయపడిపోతారు. పాముల్లో కొన్ని విషపూరీతం ఉండటంతో.. అవి కాటు వేయగానే కొద్ది నిమిషాల్లోనే వ్యక్తులు చనిపోతారు. మరికొందరు వాటిని చూసి భయపడకుండా.. సులువుగా పట్టేస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి.. పామును పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. అది చూశారంటే మీకు గూస్‌బంప్స్ రావడం ఖాయం.

Governor Tamilisai: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన

ఈ వీడియోలో ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటికి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనపడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తరువాత.. స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేస్తాడు. అలా పామును పట్టడంతో అది ఎవరికీ హాని కలిగించకుండా అయిపోయింది.

Pushpa The Rule: సుక్కూని జక్కన్న పూనాడా ఏంటి.. ఇంతలా చెక్కుతున్నాడు!!

ఈ గూస్‌బంప్స్ వీడియోను సోషల్ మీడియాలో పాము_నవీన్ అనే IDతో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 4 మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూశారు. లక్ష మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా పలురకాల కామెంట్స్ చేశారు. కొంతమంది నెటిజన్లు రక్షించిన పామును ప్రమాదకరమైన నాగుపాముగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు భయం లేకుండా త్వరగా పామును పట్టుకుని పెట్టెలో బంధించిన వ్యక్తి యొక్క ధైర్యాన్ని కొనియాడుతున్నారు. మరొరు ‘ఈ రెస్క్యూ పిల్లిని పట్టుకోవడం లాంటిది’ అని కామెంట్ చేశాడు.