Site icon NTV Telugu

AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు

Chandrababu

Chandrababu

పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం వితరణ చేసేందుకు సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చింది. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలెంనకు చెందిన నరిశెట్టి రాజమ్మ సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్ధం చెక్కు అందించేందుకు వచ్చింది.

Read Also: UP: ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. వివాహిత ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రేమికుడు..

ఈ నేపథ్యంలో తమ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఉన్నాయని.. వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు మంజూరు చేస్తే అందుకు అవసరమైన 2 లేదా 3 సెంట్ల చొప్పున స్థలం సమకూర్చుతానని తెలిపింది. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు ఆమెతో మాట్లాడుతూ, త్వరలో గృహ నిర్మాణ పథకం ప్రారంభం అవుతుందని.. ఆ సమయంలో అధికారులు సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు ఆమెతో అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు ఉదారంగా ముందుకొచ్చిన రాజమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

Read Also: CM Chandrababu: అభిమాన నేతకు పేద విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం

Exit mobile version