NTV Telugu Site icon

Mohammed Sufiyan : ఎట్టకేలకు రష్యా ఆర్మీ చెర నుంచి బయటపడ్డ భారతీయ యువకుడు..

Shamshabad Airport

Shamshabad Airport

రష్యా – ఉక్రెయిన్ సరిహద్దులో చిక్కుకుపోయిన నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సూఫీయాన్ (24) ఎట్టకేలకు ఇండియాకు చేరుకున్నారు. గత రెండేళ్లు గా దుబాయ్ హోటల్ లో పని చేస్తున్న సూఫియాన్ తో పాటు మరో నలుగురిని అక్కడి నుండి రష్యా పంపించి నమ్మించి రష్యా భాషలో ఉన్న అగ్రిమెంట్ కాగితాల పైన సంతకాలు చేయించి సైన్యం లో చేర్పించాడు ఏజెంట్. వారి కోసం కుటింబీకులు నానా ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన హసన్ అనే యువకుడు చనిపోయాడని అతని మృత దేహం కోసం ప్రయత్నిస్తున్నారని వచ్చిన వార్తలు చూసి భయాందోళనకు గురయ్యారు నారాయణపేట కు చెందిన సూఫీయాన్‌ కుటుంబం. దీంతో రెండు రోజుల క్రితమే మా అబ్బాయి ఫోన్ లో మాట్లాడారని ఇప్పటికైనా దయచేసి సూఫియాన్ ను ఇండియా కు తీసుకురావాలని తల్లిదండ్రులు జహుర్, నసీమ, సోదరుడు సల్మాన్ కోరారు. అధికారుల చొరవతో దీంతో 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న సోఫీయాన్ క్షేమంగా ఇండియా కి తిరిగి వచ్చాడు.

Nimmala Rama Naidu: ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి లేదు.. జగన్ పై విమర్శనాస్త్రాలు

కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న సోఫియాన్ ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు పేరెంట్స్, బంధువులు. సోఫియాన్ తోపాటు రష్యా ఆర్మీ చేతిలో బంధీ అయిన యువకుడు అఫ్రిది చనిపోవడంతో సోఫియాన్ కుటుంబంలోనూ ఆందోళన చెందారు. క్షేమంగా తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు పేరెంట్స్.. ఉద్యోగం పేరుతో లక్షల రూపాయలు దండుకుని.. ముంబై కి చెందిన ఓ ఏజెంట్ రష్యా పంపాడు. ముంబై ఏజెంట్ చేతిలో మోసపోయి.. రష్యా ఆర్మీ చేతిలో బంధీ అయ్యారు 9 మంది భారతీయ యువకులు. ఇందులో హైదారాబాద్ కి చెందిన యువకుడు అఫ్రిదీ మృతి చెందాడు. బంధీ చేసిన యువకులకు ట్రెయినింగ్ ఇచ్చి.. ఆయుధాలు చేతపట్టించి ఉక్రెయిన్ బార్డర్ లో గస్తీ కోసం రష్యా ఆర్మీ వాడినట్లు తెలుస్తోంది. తమను రష్యా ఆర్మీ బంధించి.. ఉక్రెయిన్ బార్డర్ లో కాపలాగా పెట్టిందని 6 నెలల క్రితం వీడియో పంపారు యువకులు.. యువకులను క్షేమంగా రప్పించడం కోసం.. నానా తంటాలు పడ్డారు పేరెంట్స్.

Pakistan: పాకిస్తాన్‌లో ఆర్మీ వర్సెస్ పోలీస్.. సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని నిరసన..