NTV Telugu Site icon

America: సరస్సులో మునిగి భారతీయ యువకుడి మృతి..28 రోజుల తర్వాత మృతదేహం

Siddhant Patil (1)

Siddhant Patil (1)

అమెరికా మోంటానాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్ సరస్సులో మునిగిపోయిన భారతీయ యువకుడి మృతదేహం ఆదివారం ఉదయం అవలాంచె క్రీక్ సమీపంలో లభ్యమైంది. రేంజర్లు లోయలోని రాక్ దగ్గర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుస్తులు, సామగ్రి ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న సిద్ధాంత్ పాటిల్ అనే భారతీయ యువకుడు జులై 6న అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో స్నేహితులతో కలిసి హైకింగ్‌కు వెళ్లాడు. సిద్ధాంత్ బ్యాలెన్స్ కోల్పోయిన తర్వాత అవలాంచె క్రీక్‌లో నీటి అడుగున పడిపోయాడు.

READ MORE: Mandipalli Ramprasad Reddy: గత ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి..

సిద్ధాంత్ అదృశ్యం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన హెలికాప్టర్ల సాయంతో సోదాలు నిర్వహించినా ఎలాంటి క్లూ లభించలేదు. హెలికాప్టర్ల ద్వారా డ్రెయిన్, పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 10 మందికి పైగా రేంజర్లు కాలువ వెంబడి కాలినడకన వెతుకుతూనే ఉన్నారు. తప్పిపోయిన సిద్ధాంత్ ని వెతకడానికి జులై 10న అవలాంచె క్రీక్ మీదుగా డ్రోన్ కూడా ఎగురవేయబడింది. అయితే ఇది కూడా విఫలమైంది. ఆదివారం ఉదయం ఒక పర్యాటకుడు కాన్యన్ దిగువన ఉన్న అవలాంచె క్రీక్‌లో మృతదేహాన్ని గుర్తించాడు. ఈ విషయాన్ని రేంజర్లకు తెలిపాడు. దీంతో రేంజర్లు మృతదేహం వెలికితీశారు. ఐడీ కార్డ్ ల అధారంగా గుర్తించారు. మృతదేహం లభ్యమైన విషయాన్ని అమెరికన్ రేంజర్ అధికారులు తెలియజేసినట్లు సిద్ధాంత్ మామ ప్రీతేష్ చౌదరి తెలిపారు. సిద్ధాంత్ మృతదేహాన్ని భారతదేశానికి పంపే పనులు జరుగుతున్నాయి.

Show comments