NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక చర్చ..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సులు, రవాణా శాఖలో పలు అంశాలపై రేపు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో ఫ్రీ బస్సుల అమలును అధ్యయనం చేసే దిశగా నిర్ణయించే అవకాశం ఉంది. అధ్యయనం అనంతరం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Tall people: ప్రపంచంలోనే అత్యధిక పొడవాటి వ్యక్తులున్న దేశం ఏదో తెలుసా?

ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులలో 15 లక్షల వరకూ మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయణానికి నెలకు రూ. 250 కోట్లు అంచనా. మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25% వరకూ కార్పొరేషన్ కు వదిలేయాలి.. మరో రూ. 125 కోట్ల వరకూ నెలకు ఆర్టీసీకే ప్రభుత్వం రీఎంబర్సుమెంటు ఇవ్వాల్సి ఉంటుంది.. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. రేపటి సీఎం సమీక్షలో మహిళలకు ఉచిత బస్సుపై అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: Women’s Asia Cup Final 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళల జట్టు..