NTV Telugu Site icon

Jhansi Fire Incident: షార్ట్‌సర్క్యూట్‌ కాదు.. ఆస్పత్రిలో నర్సు అగ్గిపుల్ల వెలిగించింది?

Up News

Up News

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్‌ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగాయని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు భిన్నమైన వార్తలు వస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ పైపును కనెక్ట్ చేసేందుకు ఓ నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని, అగ్గిపుల్ల వెలిగిన వెంటనే వార్డు మొత్తం మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

READ MORE: Ponnam Prabhakar: గీతా కార్మికులకు త్వరలో మోపెడులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన పొన్నం ప్రభాకర్‌

ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్‌లో తన కొడుకును చేర్చిన వారిలో హమీర్‌పూర్ నివాసి భగవాన్ దాస్ ఒకరు. నిన్న మంటలు చెలరేగినప్పుడు.. భగవాన్ దాస్ వార్డులో ఉన్నాడు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. కానీ ఈ ఘటన వెనుక అసలు కారణాన్ని ప్రత్యక్ష సాక్షి భగవాన్ దాస్ చెప్పాడు. భగవాన్ దాస్ ప్రకారం.. పిల్లల వార్డులో ఆక్సిజన్ సిలిండర్ పైపును కనెక్ట్ చేయడానికి నర్సు అగ్గిపుల్లని వెలిగించింది. ఆమె అగ్గిపెట్టె వెలిగించిన వెంటనే, వార్డు మొత్తం మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే, భగవాన్ దాస్ 3 నుంచి 4 మంది పిల్లలను తన మెడకు చుట్టికుని బయటకు పరిగెత్తాడు. కొంత మందిని రక్షించాడు.

READ MORE:Myke Tyson vs Jake Paul Fight: మైక్‌ టైసన్‌ను మట్టి కరిపించిన 27 ఏళ్ల యూట్యూబర్

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక అలారం మోగింది. కానీ.. ఆ వార్డులో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. సిలిండర్‌లో నింపిన లిక్విడ్‌ను గడువు తేదీ కూడా ముగిసినట్లు తేలింది. అంటే అగ్నిమాపక యంత్రం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా.. ఈ సిలిండర్లు ఖాళీగా ఉన్నాయని చూపించేందుకు ఇక్కడే ఉంచారు.