NTV Telugu Site icon

Breaking News: కోల్‌కతాలో పేలుడు.. అనుమానిత బ్యాగ్‌ని తనిఖీ చేస్తుండగా..

Kolkata

Kolkata

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పేలుడు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. జాతీయ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. శనివారం పావు నుంచి రెండు (01.45) సమయంలో తల్తాలా పోలీస్ స్టేషన్‌కు అనుమానాస్పద బ్యాగ్ గురించి సమాచారం అందింది. బ్యాగ్‌ని తనిఖీ చేస్తుండగా అది పేలడంతో చెత్త సేకరించే వ్యక్తికి గాయాలయ్యాయి. బ్లాచ్‌మన్ సెయింట్, ఎస్‌ఎన్ బెనర్జీ రోడ్‌లో ప్లాస్టిక్ బ్యాగ్ లో పేలుడు సంభవించింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగ్ తీయడానికి ప్రయత్నించగా.. అది పేలిపోయింది.

READ MORE: Telusu Kada: మంచి స్పీడుమీదున్నాం.. తెలుసు కదా!!

ఈ పేలుడు తరువాత.. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి బీడీడీఎస్ బృందాన్ని పిలిపించారు. బీడీడీఎస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. వారి ఆమోదం అనంతరం అక్కడి నుంచి రాకపోకలను అనుమతించారు. గాయపడిన వ్యక్తి తన పేరు బాపి దాస్ (58) అని వెల్లడించారు. అతను ఎస్ఎన్ బెనర్జీ రోడ్ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెత్త చేకరిస్తుండగా.. ఓ బ్యాగ్ ని తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్పుడు పేలుడు సంభవించింది. ఈ కేసులో బాధితుడి వాంగ్మూలాన్ని పోలీసులు ఇంకా నమోదు చేయలేదు. బాధితుడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ విచారణ కూడా జరుగుతోంది.

Show comments