NTV Telugu Site icon

Elephant Died: వేటగాళ్ల ఉచ్చుకు మరో ఏనుగు బలి

Elephant

Elephant

Elephant Died: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి చెందింది. శనివారం రాత్రి మహాసముంద్‌లో ఏనుగు మృతదేహం లభ్యమైంది. నారాయణ్ సింగ్ రిజర్వాయర్ కోదార్ ఎడమ గట్టు కాలువలో విద్యుదాఘాతానికి గురై మగ ఏనుగు చనిపోయింది. ఈ ఘటన జనవరి 7వ తేదీ రాత్రి జరిగింది. పెట్రోలింగ్ బృందానికి సమాచారం అందగానే వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు అటవీ సిబ్బంది అక్కడు చేరుకుని పరిశీలించారు. ఆ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడే ముఠా చురుకుగా ఉంటుంది.

Read Also: Is it Good to Eat Leaves: ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలెన్నో

కోడేరు రిజర్వాయర్‌ సమీపంలోని 11కేవీ విద్యుత్‌ లైన్‌కు హుకింగ్‌ ద్వారా వైర్లు వేశారు వేట గాళ్లు. రెండు ఏనుగులు గరియాబంద్ జిల్లా నుంచి మహాసముంద్ మీదుగా సిర్పూర్ ప్రాంతానికి వెళుతుండగా.. వారు వేసిన లైవ్ వైర్‌ ఏనుగు దంతానికి తగిలింది. దీంతో మగ ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రాంతంలో ఏనుగుల మరణాల సంఘటనలు పెరుగుతున్నాయి. గత మూడునెలల్లో ఈ విధంగా ఏనుగులు చనిపోయిన ఘటన రెండోది. గతంలో నవంబర్ నెలలో పిథోరా ప్రాంతంలోని బార్ నవాపర అభయారణ్యంలో ఇదే విధంగా విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందింది.

Read Also: Rashmika Mandanna No Makeup Look: మేకప్ లేకుండా రష్మికను చూసి షాక్ తిన్న ఫ్యాన్స్

మరోవైపు, బాగిచా అటవీ రేంజ్‌లోని కుర్‌దేగ్ గ్రామంలోని అడవిలో విద్యుదాఘాతంతో పెద్ద ఏనుగు మృతి చెందింది. తీగ తగిలి ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతదేహాన్ని పొలంలో స్వాధీనం చేసుకుసి పోస్టుమార్టం చేసి అంత్యక్రియలు నిర్వహించినట్లు అటవీశాఖ పేర్కొంది.

Show comments