NTV Telugu Site icon

Earthquake: మరోసారి వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

Earthquake

Earthquake

గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు సాయంత్రం 4.37 గంటలకు ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం కచ్‌లోని దుధై సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ISR) ఈ విషయాన్ని వెల్లడించింది.

READ MORE: Mumbai: ముంబైలో దారుణం.. పాఠశాల గదిలో బాలికపై టీచర్ అత్యాచారం

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం సాయంత్రం 4:37 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ISR) తెలిపింది. కచ్‌లోని దుధై సమీపంలోని నవ్‌లాఖా రాన్‌లో భూమికి 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఇది కచ్‌లోని దుధైకి ఉత్తర-వాయువ్యంగా 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే భూకంపం సంభవించిన సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

READ MORE: 6th-generation fighter Jets: ఇండియా ముందు రెండు భారీ ఆఫర్లు.. ఇక చైనా, పాకిస్తాన్‌కి చుక్కలే..

Show comments