NTV Telugu Site icon

Congress: హస్తం గూటికి చేరిన బీఎస్పీ సస్పెండ్ ఎంపీ

Ali

Ali

సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా సస్పెండెడ్‌ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఐదు రోజుల క్రితం డానిష్‌ అలీ కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఆరోజు నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. మొత్తానికి బుధవారం ఆయన హస్తం గూటికి చేరారు. ఢిల్లీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ కేటాయించింది.

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రలో డానిష్‌ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా తనకు చాలా ముఖ్యమైందని.. ఇక్కడ రావటంతో తన మనసు కుదుటపడిందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండడంతో డానిష్ అలీని బీఎస్పీ గతేడాది సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మొత్తానికి ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.