NTV Telugu Site icon

Amitabh Bachchan: అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసలు.. వీడియో వైరల్

Allu

Allu

Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈసినిమా అన్ని భాషల్లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. పుష్పగా అల్లు అర్జున్ నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పుకోవాలి. ఇక పుష్పలో సాంగ్స్ ప్రపంచాన్ని ఊపేసాయి. ఇండియానే కాకుండా జపాన్ లో కూడా ఈ సాంగ్ కు పిచ్చ ఫాన్స్ అయిపోయారు. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కు ఫిదా అయ్యారు. ఇక తాజాగా అల్లు అర్జున్ పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించాడు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వహస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ షోలో అమితాబ్.. అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రశ్నను అడిగాడు.

Japan: టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్.. యూట్యూబ్ లో కుమ్మేస్తోంది

2023 లో నేషనల్ అవార్డువిన్నర్ ఎవరు.. ? అన్న ప్రశ్నకు కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని సరైన సమాధానం ఇచ్చి నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఇక ఈ ప్రశ్న తరువాత.. అమితాబ్ మాట్లాడుతూ.. ” అద్భుతమైన సినిమా. శ్రీవల్లి పాట నిజంగా ప్రభంజనం సృష్టించింది. చెప్పు వదిలేస్తే వైరల్‌ అవ్వడం నేను జీవితంలో మొదటి సారి చూశాను. ఆ పాట వచ్చిన తర్వాత ఎవరు చూసినా కూడా చెప్పు వదిలేసి డ్యాన్స్ చేయడం నేను చూశాను. ఒక పాటకు అంతగా పాపులారిటీ రావడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వీడియో చూసిన అభిమానులు అది అల్లు అర్జున్ రేంజ్ అని కామెంట్స్ పెడుతున్నారు.