Amitabh Bachchan: ఇందుకే కాబోలు బిగ్‭బి అయ్యింది.. 82 ఏళ్ల వయస్సులోనూ తైక్వాండో కిక్ (వీడియో)

  • 82 ఏళ్ల వయస్సులోనూ
  • తైక్వాండో కిక్ ఇచ్చిన బిగ్‭బి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.
Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ఏ ఒక్క భారతీయుడికి పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్ పతి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ జరుగుతోంది. ఈ షోకి ఇప్పటికే అనేకమంది సినీ తారలు హాజరయ్యారు. అయితే, తాజాగా ఓ ఎపిసోడ్‌లో ఓ అమ్మాయి రాగా.. మతాల సందర్బంగా తనకు తైక్వాండో వచ్చు అంది. దాంతో వెంటనే అమితాబ్ బచ్చన్ తన సీటు నుండి లేచి, అమ్మాయిని కూడా సీట్ నుండి బయటికి రమ్మని చెప్పి, తన టైక్వాండో కిక్స్ చూపించమని అడిగాడు. అప్పుడు చిన్న అమ్మాయి “వద్దు సార్” అని చెప్పి కొంచెం భయపడుతుంది.

Read Also: Dhananjaya Engagement: డాక్టర్‭తో ఇంత సింపుల్‭గా నిశ్చితార్ధం చేసుకున్నావేంటి ‘జాలి రెడ్డి’.. వీడియో వైరల్

×
×
Ad

అయితే ఎంతకు వినని అమితాబ్ బచ్చన్ ఆ అమ్మాయిని కిక్ చేయమని అడగగా, కొంత సమయం తర్వాత అమ్మాయి టైక్వాండో కిక్‌ని చేస్తుంది. దాంతో అమితాబ్‌ షాక్‌కి గురి అవుతాడు. అమితాబ్ అమ్మాయి కిక్ చూసి షాక్ అయ్యాడు. ఆ అమ్మాయి దాదాపు కాలు పైకెత్తి దాదాపు అమితాబ్‌ ఎత్తుకు సరిపడా కిక్ ఇచ్చింది. దీని తర్వాత, అమితాబ్ అమ్మాయిని అభినందించాడు. అలాగే ఈ కిక్ ను కొట్టడానికి ప్రయత్నించకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ కిక్ ఎలా చెయ్యాలని అమ్మాయిని అడుగుతాడు. ఆ చిన్నారు వద్దు వద్దు అంటున్న.. బిగ్‭బి వినకుండా కిక్ ఇస్తాడు. ఆ సమయంలో అమితాబ్ చాలా ఎత్తుకు తన కాలును లేపి కిక్ చేసాడు. ఈ దెబ్బతో అక్కడున్న వారందరరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొందరేమో కల్కి సినిమాలో చేసిన స్టంట్స్ కంటే పెద్దగా ఏమి చేయలేదని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు, ఆయనకి ఇప్పుడు 82 ఏళ్లు. ఈ వయసులో కూడా ఇలాంటి విన్యాసాలు చేయడం ఆయనకు మామూలు విషయం కాదని కామెంట్ చేస్తున్నారు.