Site icon NTV Telugu

Amitabh Bachchan : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..

Amitabh Bachchan

Amitabh Bachchan

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘ఇది వెళ్ళే సమయం…’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. సోషల్‌ మీడియాలో రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్‌కు అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.

READ MORE: AP Inter exams: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

తాజాగా జరిగిన కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. “నేను ట్వీట్‌లో వెళ్లాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నాను. అందులో తప్పు ఏముంది. నేను షూటింగ్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని ఆ పోస్ట్‌ ద్వారా తెలిపాను. అదే ఆ ట్వీట్ అర్థం. మీరు రాత్రి 2 గంటలకు కూడా ఇలా సరదా ప్రశ్నలు అడుగుతున్నారా? నేను ఎప్పుడు ఇంటికి వెళ్లాలి? ఎప్పుడు నిద్రించాలి?” అని ప్రేక్షకులను తన మాటలతో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులకు క్లారిటీ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

READ MORE: England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా

అమితాబ్ బచ్చన్ రాబోయే సినిమాలు..
కాగా.. అమితాబ్ బచ్చన్ త్వరలో జైమానత్ , ఆంఖే 2 , ది ఇంటర్న్ , కాక్టెయిల్ 2 , హన్ముఖ్ పిఘల్ గయే చిత్రాల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ చివరిసారిగా అయాన్ ముఖర్జీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో కనిపించారు. జనాలకు ఈ సినిమా బాగా ఆదరించారు. ఆయన యాక్టింగ్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అతను దాని రెండవ భాగంలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది అంటే 2026లో బిగ్ స్క్రీన్‌పై విడుదల కానుంది.

Exit mobile version