Site icon NTV Telugu

Amit Shah warning to Tamilisai: తమిళిసైకి అమిత్‌షా వార్నింగ్..!

Amit Shah

Amit Shah

Amit Shah warning to Tamilisai: తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ తదితరులు ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు తమిళిసై సౌందరరాజన్‌.. ఈ సందర్భంగా తమిళిసైతో మాట్లాడారు అమిత్‌షా.. అయితే, వెంకయ్యనాయుడు, అమిత్‌షాకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తున్న తమిళిసైని వెనక్కి పిలిచిన దాదాపు నిమిషం పాటు మాట్లాడారు అమిత్‌షా.. ఈ సమయంలో అమిత్‌షా కాస్త సీరియస్‌గా ఉన్నట్టు కనిపించింది.. తమిళనాడు అన్నామలైతో గొడవపడొద్దని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.

Read Also: Sai Dharam Tej: షాకింగ్: అల్లు జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు

కాగా, లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో చిచ్చుపెట్టాయి.. అన్నామలై, తమిళిసై సౌందర్‌రాజన్‌ మధ్య విభేదాలు ముదిరినట్టు కొన్ని ఘటనలు స్పష్టం చేశాయి.. ఇరువురి మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద జల్లుకుంటున్నారు. తమిళిసై సౌందర్‌రాజన్‌ ఇటీవల మాట్లాడుతూ… బీజేపీలోకి సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.. అయితే, దీనిపై పెద్ద రచ్చే జరిగింది.. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుచ్చి సూరియ శివ.. తమిళిసై వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇక, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి అన్నామలై కారణమని కొందరు ఆరోపించారు.. మరోవైపు.. తమిళిసై పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తున్నారని మరికొందరు మండిపడ్డారు.. ఈ వ్యవహారాలు అన్నీ బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో.. ఏపీలో తనను ఎదురైన తమిళిసైని అమిత్‌షా సీరియస్‌గా మందలించినట్టు తెలుస్తోంది.

Exit mobile version