NTV Telugu Site icon

Amit Shah : మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగింది

Amit Shah

Amit Shah

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకువచ్చేందుకు కాషాయనాథులు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా నేడు వరంగల్‌ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొని మాట్లాడుతూ.. సర్వసంపన్న తెలంగాణ కేసీఆర్ అవినీతితో అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అవినీతి అడ్డగా మారారని, బీఆర్ఎస్ అంటే భారత్ బ్రాస్టాచార్ సమితి అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం చేశారని, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగిందని, కేసీఆర్ కుంభకోణాలు లెక్కబెట్టాలంటే వారం రోజులు పడుతుందన్నారు అమిత్‌ షా.

అంతేకాకుండా.. ‘రాజ్యాంగ విరుద్ధంగా 4శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు… వాటిని రద్దు చేస్తాం. భద్రాచలం రాముడికి సీఎం హోదాలో కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించకుండా అవమానపరిచారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం. ఎంజీఎంలో ఎలుకలు కొరికి వ్యక్తి చనిపోయాడు. బీజేపీని గెలిపిస్తే ఎంజీఎం అభివృద్ధి కోసం వెయ్యికోట్ల రూపాయలు కేటాయిస్తాం. అయోద్యలో రాముడి దర్శనం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలి. మిలుగు రాష్ట్రంగా ఏర్పాటు అయిన తెలంగాణ అప్పులపాలైంది. మిషన్ కాకతీయతో పాటు మియాపూర్ భూమి వేలంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ కుంభకోణం నెలకుంది. మిషన్ కాకతీయ పేరుతో 22 వేల కోట్ల కుంభకోణం జరిగింది. తెలంగాణ పాలన కుంభకోణంలో మునిగింది. తెలంగాణ విమోచన దినోత్సవంను జరపడం లేదు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాగానే 17సెప్టెంబర్ అధికారికంగా జరుపుతాం. ఓవైసీ ఒత్తిడి లొంగి కేసీఆర్ కేటాయించిన 4శాతం రిజర్వేషన్ తొలగిస్తాం. సీతారాములు కల్యాణం పట్టువస్ర్తాలను సమిర్పించని నాయకుడు అవసరం లేదు.

కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. పేపర్ లిక్ తో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే 5 సంవత్సరాల్లో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మియాపూర్ భూమి కుంభకోణం 4వేల కోట్ల కుంభకోణం జరిగింది. తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే అక్రమంగా సంపాదించిన సొమ్ము తీసుకుంటాం. రాహుల్ బాబా 10సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేశారు. కేంద్రంలో మోదీ తెలంగాణ రెండున్నర లక్షల కోట్ల ఇచ్చింది. 9 సంవత్సరాల లో ఎంజిఎం ఆసుపత్రిని పట్టించుకున్నదే లేదు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుక కొరికి చిన్నారి మృతి చెందిన ఘటన కలిసివేసింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కు కాంగ్రెస్ అడ్డుపడింది. బీజేపీ అభ్యర్థులను తెలంగాణలో గెలిపించండి.’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.