నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి నమస్కారం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కారును.. మోడీ సంక్షేమ గ్యారేజ్ కీ పంపాలన్నారు అమిత్ షా. కేసీఆర్ అవినీతి, కమిషన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. జిల్లాలో సాగు నీరు ప్రాక్టులను నిర్లక్ష్యం చేసిందని అమిత్ షా విమర్శించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి 400కోట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని, దళిత బంధులో 30 నుండి 40 శాతం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమిషన్లు తీసుకున్నారని అమిత్ షా ఆరోపించారు. బీసీ నీ సీఎం చేస్తాం అనీ బీజేపీ హామీ ఇచ్చారని, ఎంఐఎం తో కేసీఆర్ చేతులు కలిపారన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే ఉర్దూ ను రెండో అధికార బాషాగా కేసీఆర్ చేశారని ఆయన మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్ లను బీజేపీ అధికారంలోకి రాగానే తొలగించి… బీసీ లకు ఇస్తామని అమిత్ షా వెల్లడించారు.
Also Read : Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు
సెప్టెబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు కుటుంబ పార్టీలు అని, సోనియా రాహుల్ ను ప్రధాని చేయడానికి.. కేసీఆర్ కేటీఆర్‌ను సీఎం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ మిషన్ భగీరథ అవినీతిమయమని ఆయన ధ్వజమెత్తారు. మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. మిషన్ కాకతీయలో 22 వేల కోట్ల అవినీతి జరిగిందని, బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, కుంభకోణంలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అమిత్ షా. జనవరి 22న అయోధ్య లో రాముడి విగ్రహాల ప్రతిష్ట చేస్తామని, తెలంగాణ సమగ్ర అభివృద్ది కోసం బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Also Read : Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు