జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పాడే అవకాశం ఉందని వారు తెలిపారు.. కానీ, ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో రాళ్లు విసిరి ఉద్రిక్తతలు పెంచే ధైర్యం కూడా ఎవరు చేయడం లేదన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా నిన్న (శుక్రవారం) సాయంత్రం పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ.. పార్టీల పరస్పర ఫిర్యాదులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు చేస్తే… జమ్ము కశ్మీర్‌లో రక్తపాతం చెలరేగుతుందని రాహుల్ బాబా, ముఫ్తీ అన్నారు. రాహుల్ బాబా.. ఆర్టికల్ 370 రద్దై ఇప్పటికే ఐదేళ్లు పూర్తి కావస్తుందని చెప్పారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం.. రక్తపాతం గురించి మాట్లాడటం పక్కకు పెట్టితే.. ఇక్కడ కనీసం రాళ్లు విసిరేందుకు కూడా ఎవరికీ ధైర్యం లేదన్నారు.
Read Also: Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..
కాగా, బీజేపీ భారీ మేజార్టీతో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. గత పదేళ్లలో కూడా బీజేపీకి మేజార్టీ వచ్చింది.. కానీ, ఈ పదేళ్లలో భారతీయ జనతా పార్టీ దాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి మేజార్టీని దుర్వినియోగం చేసుకున్నారు.. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోమన్నారు.. అదే విధంగా కుల ఆధారిత రిజర్వేషన్లను కూడా బీజేపీ మార్చదని క్లారిటీ ఇచ్చారు.