NTV Telugu Site icon

Amit Shah : కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తే అల్లర్లే

Amith Shah

Amith Shah

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్ కోట్ జిల్లాలోని తెరాల్ లో జరిగిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అమిత్ షా కామెంట్స్ చేశాడు.. కాంగ్రెస్ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ది రివర్స్ గేర్ లో వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించాడు.

Also Read : Akhil Akkineni: ‘ఏజెంట్’కు ‘పఠాన్’కు పోలిక లేదు: డినో మోరియా

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజవంశ రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయి.. కర్ణాటక అల్లర్లతో అతలాకుతలం అవుతుంది అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి విపరీతంగా పెరిగిపోతుందని విమర్శించారు. కర్ణాటకలో రాజకీయ సుస్థితర కోస బీజేపీని గెలిపించాని ప్రజలను అమిత్ షా కోరారు. బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని న్యూ కర్ణాటక వైపు నడిపించగలదని అన్నారు.

Also Read : Talasani Srinivas : బడుగుబలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దే

ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్ ను తొలగించాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి అమిత్ షా మద్దతు ఇచ్చారు.. మత ప్రాదిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని మేము నమ్ముతున్నాము అని కేంద్ర హోంమత్రి అమిత్ షా అన్నారు. ఈ ఎన్నికలు కర్ణాటకను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చడానికి.. ఇక్కడ రాజకీయ స్థిరత్వాన్ని కూడా తీసుకురావాడానికి అని అమిత్ షా అన్నారు. జేడీ( ఎస్ )కి ఓటేయడం అంటే కాంగ్రెస్ కు ఓటు వేయడమేనని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు పడకూడదనుకుంటే.. రాష్ట్రాభివృద్ది కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.