Site icon NTV Telugu

Amit Shah: “చర్చలు జరిపేదే లేదు.. ఆయుధాలు విడిచి లొంగిపోండి..” మావోలకు అమిత్‌షా ఛాన్స్..

Amit Shah

Amit Shah

మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు కీలక నేతలు హతమయ్యారు. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో నెత్తురోడుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని సూచించారు. వర్షాకాలంలో కూడా నక్సల్స్​ ఏరివేత కొనసాగుతుందని వెల్లడించారు. మార్చి 2026లోగా నక్సలైట్లను నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదలిన వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తామని వెల్లడించారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: IND vs ENG: 5 వికెట్లతో మెరిసిన బుమ్రా.. భారత్ కు స్వల్ప ఆధిక్యత..!

“విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. నక్సల్స్​ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించామని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని ప్రశంసించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను వేగవంతం చేస్తామని తెలిపారు. తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్‌కు వస్తున్నానని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే అని కొనియాడారు. ఈ వేదిక మీదుగా అమిత్ షా నక్సల్స్‌కి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని వెల్లడించారు.

READ MORE: AP Deputy CM Pawan: క్రైస్తవులు, ముస్లింలు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు.. కానీ హిందువులు మాత్రం..?

Exit mobile version