Site icon NTV Telugu

Amit Shah: రాహుల్, ప్రియాంకా గాంధీని చూసైనా కాస్త నేర్చుకో..

Amit Shah Rahul Gandhi

Amit Shah Rahul Gandhi

Amit Shah: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించలేదు. కేంద్రం ప్రతిపాదించిన 3 బిల్లులపై లోక్‌సభలో వాడీవేడి చర్చ నడిచింది. అయితే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టిగా ప్రతిస్పందించారు. ప్రియాంకా గాంధీతో సహా కాంగ్రెస్ సీనియర్ల నుంచి రాహుల్ గాంధీ మాట్లాడటం నేర్చుకోవాలని అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు.

Read Also: Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

రాహుల్ గాంధీ సంస్థలను బలహీనపరుస్తున్నారని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. భాష కేవలం భావోద్వేగాలనున మాత్రమే వ్యక్తీకరించకూడదని, సభలో మాట్లాడే కళను మీ సీనియర్ల నుంచి నేర్చుకోవాలని, మీ కన్నా సీనియర్ ఎవరూ లేకపోతే ప్రియాంకా గాంధీనే సీనియర్ ఆమె నుంచి నేర్చుకోండి అంటూ హితవు పలికారు. ఈ సభ గౌరవాన్ని కాపాడటం ప్రతిపక్ష నేతగా మీ బాధ్యత, మీరు ఉపయోగించిన భాష ఆ గౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడుతూ.. ‘‘ఇది ఎలాంటి భాష, నువ్వు పిరికివాడివి, లొంగిపోతున్నావు, నాకు భయపడుతున్నావా? ఒక ప్రతిపక్ష నేత ఇలా ప్రవర్తించవచ్చా.? దేశం చూస్తోంది, మీ పార్టీని ప్రజలు పరిశీలిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

అంతకుముందు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేవలం బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తోందని, ఇది నిజమైన బిల్లు కాదని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చాలని మోడీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. ఓబీసీలు, దళితులు, మహిళలకు ఈ బిల్లు ద్వారా నష్టం చేకూరుతోందని, రాజ్యాంగంపై మనువాదాన్ని రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు.

Exit mobile version