Site icon NTV Telugu

Amit Shah: యుద్ధ బాధితులకు అండగా ఉంటాం.. కాశ్మీర్‌ టూర్‌లో అమిత్ షా భరోసా

Amitshah

Amitshah

జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు. పాక్ షెల్లింగ్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు నియామక పత్రాలను అందజేశారు.

ఇది కూడా చదవండి: Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చ‌ర్యతో స‌మానం..

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రజలను టార్గెట్‌గా చేసుకుని పాక్ దాడులు చేయడం గర్హనీయమన్నారు. పాక్ దాడుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం, ప్రజల సంఘీభావం ఉంటుందని.. యావద్దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజలు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యావద్దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని.. ఏ ఉగ్రవాద చర్యను ప్రధాని మోడీ ఉపేక్షించరని చెప్పారు.

ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..

ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం, త్రివిధ దళాల అసమాన ప్రతిభ వల్లే పాకిస్థాన్‌పై చేసిన ఆపరేషన్ సిందూర్ సక్సె్స్ అయిందని తెలిపారు. వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. కేవలం ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేశామని.. ప్రజలకు ఏ మాత్రం హాని తలపెట్టలేదని పేర్కొన్నారు. పాకిస్థాన్ మాత్రం.. మన జనావాసాలపై వైమానిక దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. దీంతో పూంచ్ ప్రాంతంలో బాగా నష్టం జరిగిందని.. గురుద్వారాలు, మదర్సాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీనికి ప్రతీకారంగా మే 9న పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై మన దళాలు దాడి చేశాయని అమిత్ షా చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

 

Exit mobile version