Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపు (గురువారం) కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ జరగనుంది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘానందరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఐదు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా గురువారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: Aparna Das Marriage: పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్!
తెలంగాణలో గురు, శుక్రవారాల్లో బన్సాల్ పర్యటిస్తారని, పెద్దఎత్తున సభలు, సమావేశాల కంటే ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మే 13 వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం సాగుతుందని.. మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి మూడు లేదా నాలుగు సమావేశాలు జరగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు.
Read also: Russia-Ukraine war : ఉక్రెయిన్‌కు సాయంగా.. రష్యాపైకి లక్షల సైన్యం
ఈ నెల 30, వచ్చే నెల 3, 4 తేదీల్లో తెలంగాణలో మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30 న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆందోల్ నియోజక వర్గంలో సభ, సాయంత్రం ఐటీ ఎంప్లాయీస్ తో శేరిలింగంపల్లి నియోజక వర్గంలో సమావేశంలో పాల్గొననున్నారు. 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ లను కలుపుతూ మరో సభ, వచ్చే నెల 4 న మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గం నారాయణ్ పేట లో… చేవెళ్ల పార్లమెంట్ లో వికారాబాద్ లో సభలో మోడీ పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరు లేదా మే 10న రాష్ట్రానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయంగా ప్రచారానికి మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు రాష్ట్రానికి రానుండటంతో.. 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారించింది. కాగా, పార్టీ లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరుకానున్నారు.
Pemmasani Chandrashekar: ఇది పెమ్మసాని హామీ.. వచ్చే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు..