NTV Telugu Site icon

Minister Amit Shah: చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి.. బహుమానంగా ఏమిచ్చారంటే?

Amith Sha

Amith Sha

Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈశాన్య భారత పర్యటన సందర్భంగా శనివారం (మార్చి 15) మిజోరాం‌లో ఓ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించారు. మిజోరాం‌కు చెందిన ఏడేళ్ల గాయనీ ఎస్తేర్ లాలదుహావమీ హనామ్తే పాటకు కేంద్రమంత్రి అమిత్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దింతో ఆ చిన్నారికి గిటార్ ను బహుకరించారు. ఈ సందర్భంగా, అమిత్ షా తన అధికారిక X (Twitter) ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ కలిపే బంధంగా మారుతుంది. మిజోరాం వండర్ కిడ్ ఎస్తేర్ లాలదుహామీ హనామ్తే వందేమాతరం పాటను ఆలపించడం నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసిందని పేర్కొన్నారు. ఏడేళ్ల వయసు ఉన్న చిన్నారి ఎస్తేర్ దేశభక్తితో నిండిన పాటను ఆలపించడం నిజంగా ఓ అద్భుత అనుభూతని అన్నారు. ఆమె గానం చేసిన ‘మా తుఝే సలామ్’ పాట ఐదవరకు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశభక్తిని వ్యక్తపరిచే ఆమె గానం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఈ ప్రతిభకు గుర్తింపుగా మిజోరాం ప్రభుత్వం చిన్నారిని అనేక అవార్డులతో సత్కరించింది.

Read Also: Harassment: మైనర్ బాలికపై వేధింపులు.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం

ఇకపోతే, హోంమంత్రి అమిత్ షా మార్చి 14 (శుక్రవారం) నుండి మూడు రోజుల పాటు అస్సాంలో పర్యటించనున్నారు. అయితే మార్చి 15న, ఆయన మిజోరంను సందర్శించారు, అక్కడ అస్సాం రైఫిల్స్ భూమిని మిజోరం ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసిన భూ బదిలీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా, అస్సాం రైఫిల్స్ సేవలను కొనియాడుతూ.. దేశ భద్రతను మార్గదర్శకంగా తీసుకుని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంలో అస్సాం రైఫిల్స్ విశేషమైన సేవలు అందిస్తోందని అన్నారు. భద్రతా దళాలు తమ భూమిలో భాగాన్ని మిజోరాం ప్రభుత్వానికి అందజేయడం ప్రజల పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

మిజోరాం రాజధాని ఐజాల్‌లో అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయాన్ని మధ్య ఐజాల్ నుండి జోఖావ్సాంగ్‌కు తరలించడానికి తీసుకున్న నిర్ణయం మిజో ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటని అమిత్ షా అన్నారు. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాకుండా, మిజోరాం ప్రజల పట్ల భారత ప్రభుత్వం నిబద్ధతకు ప్రతీకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఈశాన్య భారత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. పర్యాటకం, సాంకేతికత, వ్యవసాయం, వ్యాపారం వంటి రంగాల్లో అనేక మార్పులను తీసుకురావడంతో ఈ ప్రాంత అభివృద్ధి సమగ్రంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.