NTV Telugu Site icon

India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్

India China

India China

India-China Clash Video: అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం ధృవీకరించిన ఒక రోజు అనంతరం.. అంతకుముందు జరిగిన ఘర్షణకు సంబంధించిన తేదీ లేని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో బహుశా గత సంవత్సరం, అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన భీకర పోరు అని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో డిసెంబర్ 9 ఘటనకు సంబంధించినది కాదని ఆర్మీ గట్టిగా ఖండించింది.

2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. చైనా సైనికులు భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. ఈ వీడియో ఎల్‌ఏసీని దాటడానికి ప్రయత్నిస్తున్న చైనా సైనికులతో భారత సైనికులు హింసాత్మకంగా ఘర్షణ పడుతున్నారు. “వాళ్ళను గట్టిగా కొట్టండి, వారు తిరిగి రారు” అని జవాన్లు పంజాబీలో చెప్పడం వినబడుతుంది. భారతీయ సైనికులు చైనా సైనికులను లాఠీలతో కొట్టడం, చైనీయులు ముందుకు రాకుండా విజయవంతంగా ఆపగలిగారు. గత వారం జరిగిన సంఘటన బహిర్గతం కావడంతో వివిధ రాజకీయ నేతలు ఈ వీడియోను షేర్ చేశారు.

నిన్న పార్లమెంటులో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబర్ 9న అదే ప్రాంతంలో భూసేకరణకు చైనా చేసిన ప్రయత్నాన్ని ధృవీకరించారు. ఇరుపక్షాల మధ్య భౌతిక ఘర్షణ జరిగింది. భారత సైనికులు వీరోచితంగా పోరాడి చైనా సైనికులను వెనక్కి పంపించారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇరుదేశాల సైనికులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చైనీస్ దళాలు యాంగ్ట్సే, తవాంగ్‌లో ఎల్‌ఏసీని అతిక్రమించడానికి ప్రయత్నించాయని వెల్లడించారు. భారత సైనిక కమాండర్లు సకాలంలా జోక్యం చేసుకోగా.. చైనా సైనికులు తిరిగి తమ స్థానాలకు వెళ్లారన్నారు. కమాండర్ల సమావేశంలో చైనీయులు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఘర్షణపై స్పందించని చైనా.. సరిహద్దు వద్ద పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొంది.