Site icon NTV Telugu

Israel–Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు జో బైడెన్ మాస్టర్ ప్లాన్..?

Baiden

Baiden

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సరి కొత్త ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో కాల్పుల విరమణ, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదల గురించి కూడా ఉన్నాయి. జో బైడెన్ ప్రతిపాదనలో మూడు దశలు ఉండనున్నాయి. మొదటి దశ ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇందులో గాజాలోని జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రావడం.. అంతేగాక హమాస్ తమ దగ్గర ఉన్న మహిళలు, వృద్ధ ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయడంతో పాటు ఇజ్రాయెల్ సైతం తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా బందీలను విడుదల చేయాల్సి ఉంది. పాలస్తీనా పౌరులు గాజా అంతటా వారి ఇళ్లు, పొరుగు ప్రాంతాలకు తిరిగి రావడానికి పర్మిషన్ ఇవ్వనున్నారు.

Read Also: Loksabha Elections 2024: పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస.. చెరువులో దర్శనమిచ్చిన ఈవీఎంలు

ఇక, రెండో దశలో సైనికులతో సహా ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేయాలి. అలాగే, ఇజ్రాయెల్ దళాలు గాజాను పూర్తిగా ఖాళీ చేయాల్సిందే.. ఇది కూడా ఆరు వారాల పాటు ఉంటుంది.. ఇక, మూడో దశలో చనిపోయిన బందీల మృతదేహాలు తిరిగి ఇచ్చేడం.. అలాగే గాజా పునర్నిర్మాణానికి 3 నుంచి 5 సంవత్సరాల ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. ఒప్పందం ప్రకారం హమాస్ మరోసారి నిబంధనలు పాటించడంలో ఫెయిల్ అయితే.. ఇజ్రాయెల్ తమ సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల ఆమోదానికి యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, ఖతార్‌లు మధ్యవర్తిత్వం వహిస్తాయని పేర్కొన్నారు.

Read Also: Viswak Sen : ప్రమోషన్స్ అలా చేద్దామనుకున్నాం .. కానీ..?

అలాగే, అమెరికా ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ హమాస్ లు అంగీకరించినట్టు పలు వార్తలు వచ్చాయి. దాదాపు ఎనిమిది నెలల యుద్ధానికి ముగింపు పలికాలని అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించిన ప్రతిపదనలు పూర్తి గాజా కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయెల్ రోడ్‌మ్యాప్‌కు సానుకూలంగా ఉందని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్ కొత్త కాల్పుల విరమణ ప్రణాళికను అంగీకరించింది.. కానీ, ఇజ్రాయెల్-హమాస్ లు అధికారికంగా ప్రకటించాల్సి ఉందని జో బైడెన్ చెప్పుకొచ్చారు.

Exit mobile version