NTV Telugu Site icon

Viral News:19ఏళ్ల ప్రేమికుడి కోసం.. అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి.. చివరికీ..

America

America

ఓ అమెరికన్ మహిళ తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ చేరుకుంది. ఆమె నెలల తరబడి పాకిస్థాన్‌లో ఉండింది. ప్రభుత్వం, ప్రేమికుడి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ప్రత్యేకత ఏమిటంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆమె తన 19 సంవత్సరాల ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకుంది. పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఆ మహిళ పేరు ఒనిజా ఆండ్రూ రాబిన్సన్. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. వీరిద్దరూ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. అక్టోబర్ 2024లో ఆమె 19 ఏళ్ల నిడాల్ అహ్మద్ మెమన్ ను కలవడానికి న్యూయార్క్ నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి వచ్చింది.

READ MORE: CM Chandrababu: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

అహ్మద్ ని పెళ్లి చేసుకోవాడానికి వచ్చినట్లు సమాచారం. అహ్మద్ కుటుంబం ఆమెను తిరిగి తమ దేశానికి వెళ్లాలని కోరింది. ఆమె మాత్రం వెళ్లకుండా ప్రియుడి ఇంటి ముందే కొన్ని నెలలుగా మకాం వేసింది. దీంతో ఒనిజా వీసా గడువు ముగిసింది. పాక్‌లోనే ఇరుక్కుపోయింది. మెమన్ తాళం వేసిన ఇంటి బయట కూర్చుని ఉండటాన్ని పాకిస్థానీ యూట్యూబర్ జాఫర్ అబ్బాస్ గ్రహించాడు. ఒనిజా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ అంశం మరింత ఊపందుకుంది. ఈ వీడియో చూసి.. సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెసోరి స్పందించారు. ఆమెకు సహాయం చేసి, అమెరికాకు తిరిగి రావడానికి వీసా, టికెట్ ఏర్పాటు చేశారు. అయితే, దీని తరువాత కూడా ఆమె వెళ్ళడానికి నిరాకరించింది. తన డిమాండ్లు చేయడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో విలేకరుల సమావేశం కూడా నిర్వహించింది.

READ MORE: CM Chandrababu: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

ఒనిజా మెమన్ నుంచి వారానికి $3,00లతో పాటు, పాకిస్థాన్ పౌరసత్వం కూడా డిమాండ్ చేసింది. తాను మెమన్‌ను వివాహం చేసుకున్నానని, త్వరలోనే దుబాయ్‌లో కుటుంబాన్ని ప్రారంభించబోతున్నామని కూడా తెలిపింది. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి కూడా 20 వేల డాలర్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఒనిజాకు బైపోలార్ డిజార్డర్ ఉందని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె కుమారుడు పేర్కొన్నాడు. ఆమెను అమెరికాకు తీసుకువచ్చేందుకు కుటుంబీకులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆమె అమెరికాకు వెళ్తుందా? లేదా పాకిస్థా్న్‌లోనే ఉంటుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.