Site icon NTV Telugu

Houthi Rebels: హౌతీ రెబల్స్పై అమెరికా, యూకే స్ట్రైక్స్.. 11 మంది మృతి

Houthi Rebels

Houthi Rebels

ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌లను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ రెబల్స్ పై అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున దాడులకు దిగింది. నిన్న ( సోమవారం) యూఎస్-బ్రిటీష్ సంకీర్ణ దళాలు పశ్చిమ యెమెన్‌లోని ఓడరేవులు, చిన్న పట్టణాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మరణించారు. అలాగే, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. హౌతీలకు సంబంధించిన మీడియా సంస్థ అల్ మసీరా ప్రకారం.. US-బ్రిటీష్ సంకీర్ణం యెమెన్‌లో హోడెయిడా నగరం, రాస్ ఇస్సా నౌకాశ్రయంతో సహా దాదాపు 17 వైమానిక దాడులు నిర్వహించింది అని తెలిపింది.

Read Also: NIA Raids: దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు..

ఇక, హౌతీ రెబల్స్ దాడిలో ముగ్గురు పౌరులు మరణించి ఓడ మునిగిపోయిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. గాజా దాడులకు నిరసనగా ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం ప్రారంభించిన తర్వాత ముగ్గురు సామాన్య పౌరులు మరణించిన తొలి దాడి ఇది. అమెరికా- బ్రిటన్‌ల ఆపరేషన్ తర్వాత కూడా.. హౌతీలు తమ దాడులను కొనసాగిస్తున్నారు. హౌతీ రెబల్స్ ను కంట్రోల్ చేయడంలో ఇటువంటి వైమానిక దాడులు విజయవంతమవుతాయో లేదో చెప్పడం కష్టంగా మారింది. ఇక, ఈ దాడులతో కార్గో షిప్స్ అన్ని సౌతాఫిక్రా నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్, యూకే దాడులు చేసినట్లు తెలుస్తుంది.

Read Also: CAA: నేడు సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్.. సీఎం హెచ్చరించిన పట్టించుకోని పార్టీలు..

ఇక, నేటి (మంగళవారం) ఉదయం యెమెన్ టెలివిజన్‌లో హౌతీ ప్రతినిధి తెలిపిన ప్రకటన ప్రకారం.. ఎర్ర సముద్రంలో అమెరికన్ నౌక (పినోచియో) క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంది.. ఐఎంఓ తెలిపిన వివరాల ప్రకారం, పినోచియో అనేది సింగపూర్- రిజిస్టర్డ్ కంపెనీ ఓమ్- మార్చ్ 5 ఇంక్ యాజమాన్యంలోని లైబీరియా-ఫ్లాగ్డ్ కంటైనర్ షిప్ అని వెల్లడించారు.

Exit mobile version