NTV Telugu Site icon

America: చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం..

America

America

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్ వంటి డజన్ల కొద్దీ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఉయ్ఘర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై అఘాయిత్యాలకు పాల్పడినందుకు మూడు చైనా కంపెనీల దిగుమతులను కూడా అమెరికా నిషేధించింది. మూడు ప్రధాన చైనీస్ కంపెనీల కోఫ్కో షుగర్ హోల్డింగ్, జిజువాన్ జింగ్వేడా టెక్నాలజీ గ్రూప్ తో పాటు అన్హుయ్ జిన్యా నుంచి దిగుమతులను అమెరికా నిషేదం విధించింది. కార్మిక చట్టాలపై అవగాహన లేకపోవడంతో చక్కెర ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి నూలు తయారీ కంపెనీల వరకు బ్యాన్ చేసింది. ఈ మూడు కంపెనీలను నిషేధించిన అమెరికా ఇప్పటి వరకు మొత్తం 30 చైనా కంపెనీలపై నిషేదించింది.

Read Also: Kamareddy: ఫంక్షన్‌ వెళ్లి బిర్యాని తిన్నాడు.. గొంతులో బోన్‌ ఇరుక్కుని విలవిల లాడాడు..

ఇక, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తొమ్మిది దేశాలకు చెందిన ఇరవై మందికి పైగా వ్యక్తులపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం ఆంక్షలు విధించింది. మరోవైపు రష్యా, ఇండోనేషియా, చైనాలపై అమెరికా విదేశాంగ శాఖ వీసా ఆంక్షలు కూడా విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, బాలికలపై తాలిబాన్ అణచివేత చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా ఇద్దరు చైనా అధికారులు బహిష్కరించబడ్డారు.